తెలుగు అమ్మాయే అయినా మొదట బాలీవుడ్ లో తన లక్ టెస్ట్ చేసుకున్న అదితి రావు హైదరి మణిరత్నం చెలియా సినిమాతో సౌత్ కు పరిచయమైంది. ఇక ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటుంది. సమ్మోహనం హిట్ అవగా లేటెస్ట్ గా అంతరిక్షం సినిమాలో నటించి మెప్పించింది అదితి రావు హైదరి. ఫోటో షూట్స్ లో గ్లామర్ అదరగొట్టే అదితి రావు ఇప్పటివరకు తెలుగులో నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తూ వచ్చింది.
అంతరిక్షంలో లావణ్య త్రిపాఠి కన్నా అదితి రావుకే ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర ఇచ్చారు. ఇక ఇప్పుడు అమ్మడు క్రేజీ మల్టీస్టారర్ లో ఛాన్స్ దక్కించుకుందని అంటున్నారు. రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో అదితి రావు సెలెక్ట్ అయ్యిందట. కచ్చితంగా అదితికి ఇది గొప్ప అవకాశమని చెప్పొచ్చు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ ఎలా ఉన్నా సరే సంచలనాలు సృష్టించడం ఖాయం.
అలాంటి మల్టీస్టారర్ లో అదితికి ఛాన్స్ రావడం అదృష్టం. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది తెలియాల్సి ఉంది. కీర్తి సురేష్, కియరా అద్వానిల పేర్లు వినిపించగా ఫైనల్ గా అదితి రావు మాత్రం ఫిక్స్ అయ్యిందట. మరి సెకండ్ హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.