నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాకు సంబందించిన ఆడియో వేడుక శుక్రవారం అనగా నిన్న సాయంత్రం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు సినిమా పరిశ్రమకు సంబందించిన కొందరికి ఆహ్వానాలు వెళ్లాయి. దర్శకులు కే.రాఘవేంద్ర రావు నుండి కొరటాల శివ, బోయపాటి శ్రీను లాంటి వారు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ఆడియో.. రాజమౌళికి ఎందుకు ఇన్విటేషన్ పంపించలేదా..!
సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు కూడా ఎన్.టి.ఆర్ ఆడియో వేడుకకు వచ్చారు. అయితే దర్శకధీరుడు రాజమౌళి మిస్ అవడంపై పలు అనుమానాలకు దారి తీస్తుంది. మెగా ఫ్యామిలీకి ఎలాగు ఆహ్వానం అందలేదు. కాని రాజమౌళికి ఎందుకు బాలకృష్ణ ఇన్విటేషన్ పంపించలేదు అన్నది ఆశ్చర్యకరంగా ఉంది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళిని బాలకృష్ణ అంత తేలికగా మర్చిపోయే అవకాశం లేదు.
ఒకవేళ ఇన్విటేషన్ అందినా రాజమౌళి డుమ్మా కొట్టాడా అన్నది తెలియాల్సి ఉంది. రాజమౌళి రాకపోవడంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీకి క్లోజ్ గా ఉన్న కారణంగానే రాజమౌళికి బాలకృష్ణ ఆహ్వానం పంపలేదని అంటున్నారు. ఇక ఈ వేడుకలో వినాయక్, పూరి జగన్నాథ్, సుకుమార్ లాంటి దర్శకులు కూడా పాల్గొనలేదు. మరి వారికి ఆహ్వానం అందలేదా అన్నది తెలియాల్సి ఉంది.