దెబ్బలు తాకినప్పుడు, గాయాలు అయినప్పుడు, పుండ్లు అయినా.. మానేందుకు కొన్ని రోజుల సమయం పడుతుంది. అయితే గాయం ఎక్కువగా అయితే కొన్ని సందర్భాల్లో కుట్లు కూడా వేయాల్సి వస్తుంది. కానీ ఇకపై ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. అవును.. గాయాలు, పుండ్లు చాలా త్వరగా మానుతాయి. అందుకు గాను సైంటిస్టులు ఓ అద్భుతమైన ఆవిష్కరణ చేశారు.
అమెరికాకు చెందిన బయో మెడికల్ ఇంజినీర్లతోపాటు యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన పరిశోధకులు ఓ సర్జికల్ గ్లూ (గమ్)ను అభివృద్ధి చేశారు. దానికి మెట్రోగా నామకరణం చేశారు. సదరు గ్లూను గాయాలపై అప్లై చేయగానే కొన్ని నిమిషాల వ్యవధిలో ఆ గాయాన్ని సీల్ చేస్తుంది. దీంతో ఆ ప్రాంతం క్లోజ్ అవుతుంది. ఫలితంగా గాయం త్వరగా మానుతుంది.
Glue for wounds! pic.twitter.com/NvJNTFuXtN
— Kiran Mazumdar-Shaw (@kiranshaw) February 6, 2021
అయితే ఈ గ్లూను అప్లై చేశాక అల్ట్రా వయొలెట్ (యూవీ) కిరణాల సహాయంతో దాన్ని యాక్టివేట్ చేయాలి. అలా యాక్టివేట్ అయ్యాక ఆ గ్లూ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇక దీన్ని ఇప్పటికే పందులు, ఇతర జీవులపై ప్రయోగించి విజయం సాధించారు. దీంతో త్వరలోనే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ చేపట్టనున్నారు. ఆ తరువాత గ్లూ వాణిజ్య పరంగా మార్కెట్లోకి వస్తుంది. ఇక ఈ గ్లూ కు చెందిన ఓ వీడియోను ఆసియాకు చెందిన ప్రముఖ బయో ఫార్మాసూటికల్స్ ఎంటర్ప్రైజ్ బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.