హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది నిజంగా కస్టమర్లకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. లోన్ తీసుకోవాాలని అని అనుకుంటున్నారా…? అయితే ఇది మీకు మంచి వార్త. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజాగా ఎంసీఎల్ఆర్ రేటు తగ్గించింది. అలానే కెనరా బ్యాంక్ కూడా ఇదే. ఎంసీఎల్ఆర్ రేటు తగ్గించింది. దేశీ దిగ్గజ బ్యాంకులు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కెనరా బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేటును తగ్గించడం తో లోన్ తీసుకోవాలనుకునే వారికి కాస్త ఊరట కలుగనుంది.
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు MCLR తగ్గడం తో ఫిబ్రవరి 8 నుంచే కొత్త రేట్లు అమలు లోకి వచ్చాయి గమనించండి. ఇక కొత్త రేట్లు ఎలా ఉన్నాయి అనే విషయానికి వస్తే… హెచ్డీఎఫ్సీ ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ 6.85 శాతంగా ఉంది. నెల ఎంసీఎల్ఆర్ 6.9 శాతంగా ఉంది. అదే మూడు నెలల ఎంసీఎల్ఆర్ అయితే 6.95 శాతంగా ఉంది. అదే 6 నెలల ఎంసీఎల్ఆర్ 7.05 శాతంగా, ఏడాది ఎంసీఎల్ఆర్ 7.2 శాతంగా ఉంది.
ఇక రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 7.3 శాతంగా, 3 ఏళ్ల ఎంసీఎల్ఆర్ 7.4 శాతంగా ఉంది. ఇది ఇలా ఉండగా కెనరా బ్యాంక్ రేట్లని చూస్తే… నెల ఎంసీఎల్ఆర్ 6.7 శాతంగా ఉంది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 6.95 శాతంగా, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.3 శాతంగా ఉంది. అదే ఏడాది ఎంసీఎల్ఆర్ 7.35 శాతంగా ఉంది. బ్యాంకుల ఎంసీఎల్ఆర్ తగ్గింపుతో రుణ రేట్లు తగ్గుతాయి. దీని మూలంగా లోన్ తీసుకుంటే భారీగా బెనిఫిట్ ఉంటుంది.