నవీన్ పట్నాయక్ తో కేసీఆర్…

-

కేంద్రంలో భాజపా, కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సందర్భంగా నేడు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో సమావేశమయ్యారు. రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై ప్రత్యేకంగా చర్చించిన ఇరువురు సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ…. దేశం కోసం ఏదైనా చేయాలనే అభిప్రాయాన్ని నవీన్‌ పట్నాయక్‌ వెలిబుచ్చారని కేసీఆర్‌ తెలిపారు. చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌కు తాను మద్దతిస్తున్నట్లు ఆయన‌ చెప్పారు. రైతుల కోసం నవీన్‌ పట్నాయక్‌ తీసుకుంటున్న చర్యలను ఆయన కొనియాడారు. నూతన పాలనను కోరుకుంటున్న రాష్ట్రాల కోసం ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని, త్వరలోనే  మరోసారి నవీన్‌ పట్నాయక్‌తో సమావేశం కానున్నట్లు చెప్పారు. మేం ఎవరికీ బీ-టీమ్‌ కాదు, మాది సొంత టీమ్‌ అని పేర్కొన్నారు.

  ఒడిశా సీఎం నవీన్‌ పట్నయక్ మాట్లాడుతూ… తాము చాలా విషయాల గురించి మాట్లాడుకున్నామని, లోక్‌సభ ఎన్నికల గురించి ఇప్పుడే ఏం మాట్లాడలేమన్నారు. తెలంగాణలో రైతుల కోసం అమలు చేస్తున్నపథకాలపై చర్చించామని తెలిపారు. మరి కొద్ది రోజుల్లో దేశంలో రాజకీయ వ్యవస్థలో పెను మార్పులు రానున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news