చదివారుగా టైటిల్. షాకింగ్‌గా ఉందా? అవును. పేషెంట్ తల్లిదండ్రులు డాక్టర్లతో అన్న మాటలు ఇవి. వాళ్లు యూట్యూబ్‌లో వీడియో చూశారట. వాళ్లే ఆపరేషన్ చేస్తారట. వాళ్లకు సహాయం చేయడానికి ఒక నర్స్‌ను ఇస్తే చాలట. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకున్నది.
పేరెంట్స్ తమ బిడ్డను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వెంటనే ఆపరేషన్ థియేటర్ ఎక్కడా అని ఆరా తీశారు. మాకు ఒక నర్స్ కావాలి అని డాక్టర్లను అడిగారు. ఎందుకు అని డాక్టర్లు అడిగితే.. యూట్యూబ్‌లో ఆపరేషన్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. మేమే ఆపరేషన్ చేసుకుంటాం. మీరు మాకు ఓ నర్స్‌ను ఇవ్వండి చాలు.. అంటూ డాక్టర్లకే ఝలక్ ఇచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం డాక్టర్ల వంతయింది.
చిన్న జబ్బు వచ్చినా మీరు లక్షలకు లక్షలు తీసుకుంటారు. మీమీద మాకు నమ్మకం లేదు. అందుకే మా ఆపరేషన్ మేమే చేసుకుంటామంటూ డాక్టర్లతో పేషెంట్ తల్లిదండ్రులు గొడవ కూడా పడ్డారట. దీంతో డాక్టర్లకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదట. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకు ఆ హాస్పిటల్‌కు చెందిన ఓ డాక్టర్ ఈ ఘటనను మీడియాతో పంచుకున్నాడు. యూట్యూబ్‌లో చూసి ఆపరేషన్లు చేసేస్తే ఇక.. ఎంబీబీఎస్ చదవడం దేనికి.. అన్ని సంవత్సరాలు కష్టపడటం దేనికి అని డాక్టర్లు మండిపడుతున్నారు.