షర్మిల పార్టీతో వైసీపీకి సంబంధం లేదు.. ఆమె లైన్ దాటారు !

-

తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పెడుతున్నారని దాదాపుగా ఖాయం అయిపొయింది. ఈ వార్తల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ స్పందించారు. గత మూడు నెలలుగా పార్టీ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అయితే పార్టీ పెట్టొద్దని షర్మిలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశామని అన్నారు. షర్మిల తమ ఆత్మీయ సోదరని జగన్ కు, షర్మిల కు మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి… విబేధాలు కాదు.. జగన్ విషెస్ ఉంటాయనే అనుకుంటున్ననని మై బెస్ట్ విషెస్ టు షర్మిల అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

రెండు ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ఉండాలనేది జగన్ లక్ష్యం. తెలంగాణ రాజకీయాలపై జగన్ స్పష్టమైన వైఖరితోనే ఉన్నారని తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై షర్మిల ఇంకా నిర్ణయం తీసుకోలేదని అయినా సరే షర్మిల పార్టీతో వైసీపీకి సంబంధం లేదని అన్నారు. తెలంగాణలో వైసీపీలాంటి పార్టీ ఉండాలని షర్మిల భావించి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. 2 రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతినకూడదనే.. వైసీపీని తెలంగాణలో విస్తరించలేదని తేల్చి చెప్పారు. తెలంగాణలో సుదీర్ఘకాలం షర్మిల పాదయాత్ర చేశారని, పార్టీ నిర్ణయం, ఫలితాలను షర్మిలే చూసుకుంటారని అన్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news