వాటే పాలసీ: ఇలా చేస్తే రూ.17.5 లక్షలు పొందొచ్చు…!

-

దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC ఎన్నో రకాల పోలసీలని అందిస్తోంది. ఈ పాలసీల ద్వారా ఎన్నో బెనిఫిట్స్ అందుతాయి. ఎల్‌ఐసీ కొత్త స్కీమ్ ఒకటి తీసుకు రావడం జరిగింది. దీని ద్వారా మీకు సూపర్ బెనిఫిట్స్ కలగనున్నాయి. ఇక ఈ పాలసీ గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఎల్‌ఐసీ అందిస్తున్న ఈ కొత్త స్కీమ్ లో చేరడం వలన రెండు బెనిఫిట్స్ ఉన్నాయి. మెచ్యూరిటీ సమయంలో కచ్చితమైన రాబడి తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది.

ఈ బీమా జ్యోతి పాలసీ నాన్ లింక్డ్, నాన్ పార్టిసి పేటింగ్, ఇండివీజువల్, లిమిటెడ్ ప్రీమియం పేమెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్లాన్. రూ.1,000కు రూ.50 గ్యారంటీ రిటర్న్ పొందొచ్చు. మీరు 15 నుంచి 20 ఏళ్ల కాల పరిమితితో ఈ పాలసీని తీసుకోవచ్చు. అలానే ఎంచుకున్న కాల పరిమితికి ఐదేళ్లు తక్కువ ప్రీమియం పే చెయ్యాలి. 15 ఏళ్ల పాలసీ కనుక తీసుకున్నారనుకోండి పదేళ్లు ప్రీమియం కట్టాలి. ఇది ఇలా ఉండగా కనీసం రూ.లక్ష మొత్తానికి పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది.

90 రోజు నుంచి 60 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకునే వెసులుబాటు ఉంది. ఇది ఇలా ఉండగా రాబడి కూడా ఎక్కువే వస్తుంది. అలానే పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఒకవేళ రూ.10 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే…పాలసీ టర్మ్ 15 ఏళ్లు. వార్షిక ప్రీమియం రూ.82 వేలు అవుతుంది. దీనితో మెచ్యూరిటీ సమయంలో రూ.17.5 లక్షలు వస్తాయి. రూ.10 లక్షలు బీమా మొత్తం. రూ.7.5 లక్షలు గ్యారంటీ అడిషన్ అంటే మీకు 7.215 శాతం రాబడి వస్తుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news