తండ్రి వీర్యదానం.. కొడుకు ప్రేమకు దూరం..!

-

పాఠశాల స్థాయి ముగిసి కళాశాలల్లోకి అడుగు పెట్టగానే యుక్త వయసులో ఉంటే కుర్రకారులు అమ్మాయిల వెంట పడటం మొదలు పెడతారు. అది ఆకర్షణ మాత్రమే.. ఆ వయస్సు అలాంటిది. ప్రస్తుత కాలంలో రకరకాల యాప్‌లో అందుబాటులోకి వచ్చాయి. అందులో డేటింగ్‌ యాప్‌ల ద్వారా తాము కోరుకునే అబ్బాయి, లేదా అమ్మాయితో చాటింగ్‌ చేస్తూ ప్రేమలో పడుతున్నారు. కానీ.. ఓ యువకుడికి మాత్రం యాప్‌ల ద్వారా కాదు కదా అస్సలు ప్రేమలో పడలేని దుస్థితి ఎదురైంది.

 

500 సార్లు వీర్యదానం..

యూఎస్‌లోని ఓరెగాన్‌ రాష్ట్రానికి చెందిన జేవ్‌ఫోర్స్‌ (24), తండ్రి వయçసులో ఉన్నప్పుడు దాదాపుగా 500 సార్లు వీర్యదానం చేశాడట. ఆ వీర్యంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారు సంతానం పొందారు. ఆ వీర్యంతో పుట్టిన పిల్లలు కూడా దాదాపుగా జేవ్‌ వయస్సు ఉన్నవారే. వారు కూడా డేటింగ్‌ యాప్‌ ఉపయోగిస్తే.. ఆ యాప్‌లో నాతోనే ప్రేమలో పడితే మా నాన్న వీర్యంతో జన్మించిన అమ్మాయి వరసకు చెల్లి అవుతుందనే భయంతో జేవ్‌ ప్రేమకు దూరంగా ఉంటున్నాడు. తల్లులు వేరైన గానీ.. జన్యుపరంగా జేవ్‌ తండ్రి వీర్యంతో జన్మించారు కాబట్టి వారంతా జేవ్‌కు అక్క చెల్లేళ్లు అవుతారు. తన తండ్రి చేసిన వీర్యదానంతో జేవ్‌ ప్రేమించేందుకు వెనకాడుతున్నాడు.

ఇప్పటి దాకా 8 మంది గుర్తింపు

డేటింగ్‌ యాప్‌లో ఏ అమ్మాయికి ఐలవ్‌యూ చెప్పినా తనకు చెల్లో, అక్కో అవుతుందోనని భయపడుతున్నాడు. ఆ రాష్ట్రంలో ఇప్పటి దాకా జేయ్‌ 8 మంది అక్క చెల్లేళ్లు, అన్నదమ్ములను గుర్తించాడు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే జేవ్‌ చదువుకున్న అదే పాఠశాలలో ఒకరు చదివినట్లు ఇటీవల గుర్తించాడు. తన తండ్రి వీర్యంతో జన్మించిన ఇద్దరు ఒకే ప్రాంతంలోని పక్కపక్కనే అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్నట్లు జేవ్‌ చెప్పినంత వరకు వారి తెలియరాలేదు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎంతమంది అన్నదమ్ములు, అక్కచెల్లేళ్లు ఉంటారోనని జేవ్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news