అయ్యా రాజమౌళి.. నీకిది తగునా..?

-

భారతీయ సిని పరిశ్రమ చెప్పుకోదగిన దర్శకులలో రాజమౌళి ఒకరు. సౌత్ లో ఎప్పుడో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న రాజమౌళి బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. రాజమౌళి సినిమా అంటే పక్కా హిట్ అన్న ముద్ర పడింది. తెలుగులో ఆ విషయం ఎప్పుడో ప్రూవ్ అయ్యింది. అందుకే సొంతంగా ఓ ముద్ర వేసుకుంటాడు రాజమౌళి.

కేవలం తన సినిమాలే కాదు వేరే వాళ్ల సినిమాలను ఎంకరేజ్ చేస్తాడు రాజమౌళి. ఇతరుల టాలెంట్ మెచ్చుకోవడంలో ఏమాత్రం వెనుకడుగు వేయడు జక్కన్న. అయితే ఈ క్రమంలో నచ్చినా నచ్చకపోయినా కొన్ని సినిమాలను ప్రమోట్ చేయాల్సి వస్తుందట. ఏదైనా సినిమా రిలీజైతే రాజమౌళి ఆ సినిమా చూసి వేసే ట్వీట్ చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. రాజమౌళి ట్వీట్, సినిమా రిజల్ట్ ఒకే విధంగా ఉంటే పర్వాలేదు కాని మొహమాటానికి రాజమౌళి బాగుందని ట్వీట్ చేసి, ఆ సినిమా ఆడియెన్స్ చేత రిజెక్ట్ చేయబడితే అప్పుడు రాజమౌళి మీద విమర్శలు వస్తాయి.

రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షోలో ఈ విషయాన్ని వెళ్లడించాడు రాజమౌళి. కొన్ని సినిమాలకు మొహమాటానికి పోయి తప్పక ట్వీట్ చేశానని చెప్పాడు. రాజమౌళి లాంటి దర్శకుడు ఇలా చేస్తాడా అని అందరు అవాక్కవుతున్నారు. సో మొత్తానికి తన మిస్టేక్ ను ఒప్పుకుని తన మంచి మనసు చాటుకున్నాడు రాజమౌళి.

Read more RELATED
Recommended to you

Latest news