పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కి అసెంబ్లీ సీటు దక్కలేదు. అప్పట్లో అది పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఐతే ఆ విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కామెంట్లు చేసారు. రాజకీయం అరంగేట్రంలోనే అసెంబ్లీ సీటు గెల్చుకుని ప్రజల్లోకి వెళ్ళాము. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కి ఒక్క సీటు దక్కలేదని కామెంట్లు చేసారు.
సినిమాల్లో పవర్ స్టార్ గా చెప్పుకునే నటుడు రాజకీయాల్లో పవర్ లెస్ గా ఉండిపోయారని వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కి ఎక్కడా ఆధిక్యం అందలేదన్న సంగతి తెలిసిందే. అదంతా అటుంచితే ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో జనసేన క్యాడర్ బాగా బలపడిందని తెలుస్తుంది. బీజేపీ కంటే ఎక్కువ క్యాడర్ మరి ముందు ముందు ఏమైనా మార్పులని తీసుకువస్తుందేమో చూడాలి.