మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నామినేషన్లలో జరిగిన బెదిరింపులను సాక్ష్యాలతో సహా కోర్టులో పిటిషన్ వేశామన్న ఆయన తీర్పు రిజర్వ్ చేశారని అన్నారు. పంచాయితీ ఎన్నికలలో ఎక్కడా నాయకులు పనిచేయలేదని ఆయన అన్నారు. నాయకులు లేరు … వాలంటీర్లే పనిచేశారుని బెదిరించడం … ఓట్లు అడగడం లాంటి పనులను వాలంటీర్లు చేస్తున్నారని అన్నారు. ఇక నయినా వాలంటీర్లు జాగ్రత్త గా తమ పనిచేసుకోవాలని ఆయన హితవు పలికారు.
నాయకులు వచ్చి ధ్తెర్యంగా వచ్చి ప్రజలను ఓట్లు అడగాలని అన్నారు. పొదుపు సంఘాలు వాళ్లు బెదిరిస్తున్నారు…ఇళ్ల పట్టాలు రద్దు చేస్తామంటున్నారు అని ఆయన అన్నారు. బెదిరిస్తున్న వారిప్తె సాక్ష్యాలతో సహా పోలీసులకు , ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని ఆయన అన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల అంశం కోర్టులో ఉందన్న ఆయన నామినేషన్లలో జరిగిన బెదిరింపులను సాక్ష్యాలతో సహా కోర్టులో పిటిషన్ వేశామని, తీర్పు రిజర్వ్ చేశారని అన్నారు.