ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది వైసీపీ. కొద్ది సేపటి క్రితం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ ప్రకటించారు. ఈ ఆరు ఎమ్మెల్సీ ఖాళీలకు మార్చి 15న ఎన్నికలు జరుగునున్నాయి. ఇక అనంతపురం జిల్లాకు చెందిన ఇక్బాల్‌కు ఎమ్మెల్సీగా రెండోసారి అవకాశం ఇచ్చారు. ఇక చిత్తూరు జిల్లా నుంచి బల్లి కళ్యాణ్ చక్రవర్తిని ఎంపిక చేసింది. ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణంతో ఆయన తనయుడికి మండలిలో అవకాశం ఇచ్చింది వైసీపీ హైకమాండ్. అలానే కర్నూలు జిల్లా నుంచి చల్లా భగీరధ రెడ్డి ఛాన్స్ ఇచ్చింది.
ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి మరణంతో ఆయన తనయుడుకి అవకాశమిచ్చినట్లు చెబుతున్నారు. విజయవాడ నుంచి కార్పోరేటర్ మహ్మద్ కరీమున్నిసాకు ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 56వ వార్డు కార్పోరేటర్‌గా గతంలో పని చేశారు కరీమున్నిసా. అలానే అటు శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నకు ఆపోజిట్ గా పని చేసిన దువ్వాడ శ్రీనివాస్, చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత సి. రామచంద్రయ్యను ఎంపిక చేసింది వైసీపీ.