భార్యపై ప్రేమతో టేకు విగ్రహం చేయించి.. ఇంట్లో ప్రతిష్టించిన భర్త..!

-

సమాజంలో భార్యను హింసించే భర్తను చూసి ఉంటాం.. అలాగే భార్యను దేవతలా పూజించే భర్తలు చూస్తూ ఉంటాం. కష్టసుఖాల్లో తన వెంట నిలిచి భర్తకు చేదోడు వాదోడుగా ఉన్న భార్య హఠాత్తుగా మరణిస్తే ఆ బాధ తట్టుకోలేక ప్రాణాలు విడిచిన భర్తలను మనం రోజూ ఎక్కడో ఓ చోట చూస్తూ ఉంటాం. మరోపక్క పరలోకానికి వెళ్లిన తన భార్య గుర్తులు తనతోనే ఎప్పుడూ ఉండాలని ఆమె నిలువెత్తు విగ్రహం చేయించాడు ఓ భర్త. అంతోకాదండోయ్.. వేదమంత్రాల సాక్షిగా భార్య విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించాడు.

Wooden statue
Wooden statue

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట గ్రామం రమణరావు కాలనీలో నివాసముంటున్న మూడవ ఏపీఎస్పీ రిటైర్డ్ ఆర్ఎస్ఐ బుర్ర వీరభద్రం.. భార్య మాణిక్యాంబ. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఏడాదిన్నర క్రితం అంతుపట్టని రోగంతో హఠాత్తుగా భార్య మృతి చెందింది. దీంతో వీరభద్రం తీవ్ర ఆందోళన గురయ్యాడు. మాణిక్యాంబను మరిచిపోలేకపోయాడు. తన భార్య జ్ఞాపకాలు తనతో ఉండాలని ఆమె నిలువెత్తు విగ్రహం చేయించినట్లు తెలిపారు.

అనుకున్నదే తడవుగా నవర గ్రామానికి చెందిన శిల్పి సత్యలింగాన్ని సంప్రదించి తన భార్య ప్రతిమను టేకుతో తయారు చేయించాడు. మూడు నెలలు కష్టపడి సత్యలింగం మాణిక్యాంబ ప్రతిబింబం చేశాడు. పురోహితుల నడుమ, పూజా కార్యక్రమాలతో ఆమె ప్రతిమను ఇంట్లో ప్రతిష్టించాడు. వీరభద్రం చేసిన పనికి చుట్టుపక్కల వారు అతనికి తన భార్యపై ఎంతో ప్రేముందని మంత్రముగ్దులైనారు.

గతేడాదిలో ఇలాంటి ఘటనే..
గతేడాది ఆగస్టు నెలలో కర్ణాటకలోనూ సరిగ్గా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా భార్య కొన్నేళ్లే కిందట ఓ రోడ్డు ప్రమాదంలో మరణించటంతో ఆమె విగ్రహాన్ని చేయించి ఇంట్లో ప్రతిష్టించాడు. కుటుంబ సభ్యులంతా అది చూసి మురిసిపోయారు. అచ్చం మనిషిలానే ఉన్న ఆ మైనపు బొమ్మ గతంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వీరు చేసిన ఈ పనిని తెలిసిన వారంతా అభినందిస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఫోటోలు షేర్ చేస్తూ.. పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news