మీరు ఏమైనా బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ ఐడియాని చూడండి…!

-

ఇప్పుడు RAS, Recirculating Aqua Culture System పద్ధతి లో రైతులు మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. చుట్టుపక్కల నదులు, చెరువులు, కాలువలు వంటివి లేక పోయినా సరే కేవలం బోర్లతో ఆధునిక పద్ధతుల తో చేపల పెంపకాన్ని ప్రారంభించవచ్చు. దీంతో మీకు మంచి ఆదాయం లభిస్తుంది. అల్ట్రా హై డెన్సిటీ పద్ధతి లో చేపల పెంపకం ద్వారా చేపల వ్యర్థాల తో కూరగాయలు పెంచుకోవచ్చు. దీని కోసం ఎక్కువగా ఖర్చు అయినప్పటికీ ఆదాయం కూడా స్థిరంగా వస్తుంది.

ఈ పద్ధతిని 30 నుంచి 40 సంవత్సరాల నుంచి విదేశాల్లో చేస్తూనే ఉన్నారు కానీ మన భారత దేశానికి ఇది కొత్త. కేవలం సునాయసంగా వచ్చే అంగుళం బోరు నుంచి ఒక ఎకరంలో చేపల్ని పెంచొచ్చు. పావు ఎకరం విస్తీర్ణంలో 70 టన్నుల చేపల దిగుబడిని సాధిస్తున్నారు చాలా మంది. చేపల పెరుగుదలకు అనుగుణంగా ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయవచ్చు. అలానే టైం టూ టైం చేపలకు ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. చేపల వ్యర్థాలు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసే ప్రత్యేక పద్ధతులు కూడా వచ్చాయి.

ఎటువంటి వ్యాధుల బారిన చేపలు పడకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటూ చాలా మంది ఈ వ్యాపారం లో జోరుగా కొనసాగిస్తున్నారు. RAS పద్ధతి లో మాత్రం ఎటువంటి హాని ఉండదు ఎప్పటికప్పుడు నీటిని శుభ్రం చేస్తూ చేపల పెంపకాన్ని కొనసాగించవచ్చు. పైగా ఈ పద్ధతి లో ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎదుగుదల కూడా బాగుంటుంది. సంప్రదాయ పద్ధతుల కంటే 25 నుంచి 30 శాతం వరకు చేపలు కూడా త్వరగా ఎదిగి పోతాయి.

మామూలుగా అయితే సాధారణ విధానం లో కోటి లీటర్ల నీటిలో మూడు వేల చేపలు పెంచచ్చు కానీ అవే 3000 చేపలను 50 వేల లీటర్ల లోనే ఈ పద్దతిని అనుసరించి పెంచొచ్చు. చేపలకి సమయానికి అనుకూలంగా ఆటో ఫీడర్ ద్వారా ఫీడ్ ని ఇస్తుంది. మామూలుగా మార్కెట్లో అమ్మే చేపలు కేజీ 120 రూపాయలు ఉంటే… ఈ పద్ధతిలో పెరిగే చేపలకి 250 రూపాయలు వస్తుంది. ఎందుకంటే ఇది కెమికల్ ఫ్రీ కాబట్టి.

దీని కోసం కెమికల్ వాడాల్సిన అవసరం లేదు. ఏ మందులు ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా చేపల్ని పెంచుకోవచ్చని జీవోను విడుదల కూడా చేసింది ప్రభుత్వం. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైనా దీనిని చేయొచ్చు. చేపల తో పాటు ఇదే విధానంలో రొయ్యలు, పీతలు కూడా పెంచుకోవచ్చు. RAS పద్ధతి లో చేపల సాగు కోసం సబ్సిడీలు కూడా అందిస్తోంది.

మత్స్యకారులు అయితే 75 శాతం మిగతా వారికి 40 శాతం మేర సబ్సిడీ అందిస్తున్నారు. అయితే ఈ విధానం లో ఏర్పాటు చేసుకునే యూనిట్ ను బట్టి ఆదాయం ఉంటుంది. ఈ విధానం ద్వారా రూపాయలు 40 లక్షల నుంచి రూ 80 లక్షల వరకు ఆదాయం లభిస్తుందని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news