రుణగ్రహితలకు హెచ్‌డీఎఫ్‌సీ తీపికబురు

-

హెచ్‌డీఎఫ్‌సీ తన రుణగ్రహితలకు భారీ ఊరట కలిగించింది. రుణ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది గృహరుణాలు తీసుకున్న వారికి ఇది వర్తిస్తుంది. ఇటీవలె ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్న సంగతి లె లిసిందే. ఇప్పుడు అదే దారిలో హెచ్‌డీఎఫ్‌సీ కూడా తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించినట్టు ప్రకటించింది. దీంతో రుణ గ్రహితలకు ఊరట కలగనుంది. హెచ్‌డీఎఫ్‌సీ హోం లోన్స్‌ వడ్డీ రేట్లను తగ్గించి, 5 బేసిస్‌ పాయింట్ల కోత విధించింది.

hdfc

వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం మార్చి 4 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంకు తెలిపింది. గృహ రుణాలపై రిటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటు (ఆర్‌పీఎల్‌ఆర్‌) తగ్గిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది. రేట్ల తగ్గింపు నిర్ణయం హెచ్‌డీఎఫ్‌సీ ప్రస్తుత రిటైల్‌ హోం లోన్‌ వినియోగదారులకు అందరికీ వర్తిస్తుందని తెలిపింది. దీంతో లోన్లు తీసుకున్న వినియోగదారులకు శుభవార్త తెలిపినట్లయింది.

హెచ్‌డీఎఫ్‌సీ తగ్గింపు నిర్ణయం తరువాత హోమ్‌ లోన్స్‌పై వడ్డీ రేట్లను 6.75 శాతం నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హోమ్‌ లోన్స్‌పై వడ్డీ రెటు 6.75 శాతం నుంచి మొదలవుతుంది. ఈ రెండు బ్యాంకులు మాత్రమే కాదు, మరో బ్యాంకు కూడా ఇదే బాట పట్టింది.

ప్రైవేటు రంగానికి చెందిన కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కూడా హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్లను తగ్గించింది. ఇది 6.65 శాతం నుంచి ప్రారంభవుతుంది. ఈ వడ్డీ రేటు మార్చి చివరి వరకు హోమ్‌ లోన్‌ తీసుకున్న వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తెలిపిన విషయం తెలిసిందే. ఈ బ్యాంకులో బ్యాలన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకుంటే కూడా ఇదే వడ్డీ రేటు వర్తింస్తుందని బ్యాంకు ప్రకటించింది. ఇక ఇంకెందుకు లేటు . హోమ్‌ లోన్‌ తీసుకుని సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకుంటున్న వినియోగదారులకు ఇదే సరైన సమయం.

Read more RELATED
Recommended to you

Latest news