అమెరికాలో నల్గొండ విద్యార్థులు మృతి

-

అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. కొలిర్‌విలీలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగి నలుగురు చనిపోగా.. వీరిలో నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గుర్రపుతండాకు చెందిన ముగ్గురు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన సాత్విక్‌ నాయక్‌, సుహాన్‌ నాయక్‌, జయ సుచిత్‌ అని పోలీసులు గుర్తించారు. ఉన్నత విద్య అభ్యసించేందుకు వీరు అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. మృతిపై పూర్తి వివరాలను దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సంబంధిత అధికారుల నుంచి తెలుసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news