లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం గురువారం ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ బిల్లును ప్రవేశపెట్టనుంది. సంబంధిత అంశాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయెల్ వివరించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు గతంలో లోక్ సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే . అయితే ఇది రాజ్యసభలో ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలో మరో సారి ఈ ఆర్డినెన్స్ ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను భాజపా సభ్యులంతా విధిగా సభకు హాజరుకావాలంటూ ఇప్పటికే విప్ జారీ చేసినట్లు పేర్కొన్నారు.
ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చిన వారికి మూడేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించనున్నట్లు ఆర్డినెన్స్ లో పేర్కొన్నారు. ఈ విషయంపై గతంలో లోక్ సభ, రాజ్యసభలోనూ చర్చలు జరిగాయి. మరోసారి ఇది లోక్ సభలో ప్రవేశపెట్టడంతో దేశ వ్యాప్తంగా ట్రిఫుల్ తలాక్ చర్చనీయాంశమైంది.