రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ కచ్చితంగా జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. మూడు రాజధానుల ఏర్పాటులో కొద్ది రోజులు ప్రాసెస్ ఆగడం తప్ప నిర్ణయం ఆగదని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని, అధికారంలోకి వచ్చాక 20నెలల్లో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు.
చంద్రబాబు వ్యవహారశైలి కామెడీగా కనిపిస్తోందని చంద్రబాబులో బాగా ప్రెస్టేషన్ కనిపిస్తోందని అన్నారు. ఓడాక పశ్చాత్తాపం చెందక పోగా.. ఇంకా అలాగే మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలను అసభ్యంగా,బూతులు ఉపయోగించి చంద్రబాబు మాట్లాడుతున్నారున్న ఆయన వేడి నీళ్లలో ముంచి తీసిన బాయిలర్ కోళ్లలా చంద్రబాబు లోకేష్ ఉన్నారుని అన్నారు. చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడితే అధికారం రాదని 70 ఏళ్ల చంద్రబాబు ను సామాజిక బహిష్కరణ చేయాలని అన్నారు.