విశ్వనగరాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచడంలో జీహెచ్ఎంసీ పాత్ర ఎంతో కీలకం… నగరంలో వివిధ వ్యాపార, రెసిడెన్షియల్ సముదాయాల్లో ఎలాంటి నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా రోడ్లపైకి వ్యర్థాలను వదిలేవారికి జీహెచ్ఎంసీ జరిమానా రూపంలో బుద్దిచెప్పనుంది. ఇందులో భాగంగా … జీహెచ్ఎంసీ అధికారులు గురువారం ఎర్రమంజిల్‌లోని మోర్ సూపర్ మార్కెట్‌కు రూ.లక్ష జరిమానా విధించారు. గురువారం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి మొదలు దాని వెనుక ప్రాంతం, తాజ్ కృష్ణ రోడ్డు, ఆనంద్‌నగర్ కాలనీ, పద్మావతి కాలనీ, రాజ్‌భవన్ రోడ్డు, ప్రగతి భవన్ ప్రాంతం, కుందన్‌బాగ్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో సెంట్రల్ జోన్ కమిషనర్ ముషారఫ్ ఫారూఖీ పర్యటించారు. మోర్ సూపర్ మార్కెట్ నుంచి నీరు భారీగా లీకేజీ అవుతూ రోడ్డున పారి, దారి ధ్వంసం కావడాన్ని ఆయన గమనించడంతో మోర్‌కు రూ.లక్ష జరిమానా వేసేందుకు ఆదేశించారు. భవిష్యత్ లో కాలనీల్లోని బంగ్లాలపై దృష్టి సారించనున్నామని జోనల్ కమిషనర్ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు.
ఇష్టానుసారంగా రోడ్లను ధ్వంసం చేసేందేందుకు కారణం అవుతున్నారని, దాని మరమ్మతుల ఖర్చు మొత్తం వారి నుంచే రాబట్టనున్నామన్నారు. ఇక నుంచి ప్రతీ రోజు నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించి నిబంధనలు అతిక్రమించిన వారి పట్ల సీరియస్ యాక్షన్ తీసుకోనుంది.