ఒకరు మీకు నచ్చారనుకుందాం. వాళ్లకు కూడా మీరు నచ్చాలన్న రూల్ లేదు. బట్.. వాళ్లతో మీ జర్నీ కొనసాగాలంటే కొన్ని టిప్స్ అవసరం అవుతాయి. సైకాలజికల్ గా అవతలి వాళ్ళను అట్రాక్ట్ చేయాలంటే ఎలాంటి టిప్స్ అవసరమో తెలుసుకుందాం.
వ్యక్తిగత విషయాలు:
మీకు సంబంధించిన విషయాలను ఎమోషనల్ గా చెప్పగలగాలి. మీరు చెప్పే విషయాలు ఎలా ఉండాలంటే, వాటిల్లో హాస్యంతో పాటు కాస్తంత బాధ మిళితమై ఉండాలి. ఒక్కోసారి మీ వ్యక్తిగత విషయాలు అవతలి వాళ్ళ వ్యక్తిగత విషయాలకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కనెక్ట్ అయినప్పుడు మీరు అవతలి వాళ్లకు నచ్చుతారు.
గతం గురించి మాట్లాడండి:
ఉదాహరణకు మీరు 90’s కిడ్ అయ్యి, అవతలి వాళ్ళు కూడా అదే అయితే.. మీ చిన్నప్పుడు మీ బాల్యాన్ని గురించి మాట్లాడండి. ఇద్దరి మధ్యన మాటలు పెరగడానికి గతం బాగా ఉపయోగపడుతుంది.
వీకెండ్ ప్లాన్స్ చెప్పండి:
వీకెండ్ రాగానే ఏదో ఒక కొత్త ప్రదేశానికి మీరు వెళ్లినట్లు, అక్కడ ఫొటోస్ దిగినట్లు.. చాలా ఎంజాయ్ చేసినట్లు ఫ్యూచర్ లో కూడా మంచి మంచి ప్లేసెస్ చూడటానికి వెళుతున్నట్లు చెప్పండి. ఆ ప్లేసెస్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే.. మీతో రావటానికి ఆసక్తి చూపిస్తారు.
వాళ్లకు తెలియని క్వాలిటీస్ గుర్తించండి:
చాలాసార్లు మనలో ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయో మనకి తెలియదు. అవతలి వాళ్లకు కూడా సేమ్ అలాగే ఉంటుంది. అలాంటి క్వాలిటీస్ గుర్తించి వాళ్ళను పొగడండి.
వారి ఎమోషన్స్ గమనించండి:
వాళ్లు ఎప్పుడు ఎలా ఉంటున్నారో అబ్జర్వ్ చేయండి. వాళ్లు ఎక్సైటింగ్ గా ఉంటే వాళ్ళ హ్యాపీనెస్ లో పాలుపంచుకోండి బాధగా ఉంటే పక్కన నిలబడి ఓదార్పునివ్వండి.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.