రజినికాంత్ పెట్ట ట్రైలర్.. స్టైల్ లో సూపర్ స్టార్ తర్వాతే ఎవరైనా..!

-

సూపర్ స్టార్ రజినికాంత్ 2.ఓ తర్వాత చేస్తున్న సినిమా పెట్ట. కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ కొద్దినిమిషాల క్రితం రిలీజైంది. రజిని మార్క్ స్టైలిష్ లుక్ తో పాటుగా అదిరిపోయే డైలాగ్స్ తో పెట్ట ట్రైలర్ ఉంది. సినిమాలో రజిని రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది.

సిమ్రాన్, త్రిష ఫీమేల్ లీడ్ గా నటించిన ఈ పెట్టలో కోలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. ట్రైలర్ చూస్తేనే సినిమా పక్కా హిట్ అనేలా ఉంది. కబాలి, కాలా, 2.ఓ ఇలా మూడు సినిమాలు రజిని ఫ్యాన్స్ అర్ధాకలినే మిగిల్చాయి అందుకే కార్తిక్ సుబ్బరాజు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు విందు భోజనం లాంటి సినిమాగా ఈ పెట్టాని తీర్చిదిద్దాడని తెలుస్తుంది.

ట్రైలర్ ఆసక్తిగా ఉండగా సినిమా ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. సినిమాలో రజిని క్యారక్టరైజేషన్ డైలాగ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారని చెప్పొచ్చు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా అదిరిపోయేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news