యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతా రామన్ మంగళవారం నాడు లోక్ సభ లో ప్రభుత్వం యజమానులు సహకరించని పీఎఫ్ వాటాదారులకు సంవత్సరానికి ఐదు లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తుంది అని అన్నారు. ఫిబ్రవరి 1 నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆర్ధక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఏప్రిల్ 1 నుంచి 2.5 లక్షలు పైబడిన పిఎఫ్ సహకారంపై వడ్డీ పై పన్ను విధించడం గురించి మాట్లాడారు.
దీనికి సంబంధించి ఆమె పార్లమెంట్ లో క్లారిటీ ఇచ్చారు. పన్ను ప్రతిపాదనలతో కూడిన ఆర్థిక బిల్లు 2021 లోక్ సభ లో మంగళవారం ఆమోదించారు. 127 సవరణ అప్రూవల్ తో బిల్ పాస్ అయింది. ఈ డిస్కషన్ లో కేవలం ఒక శాతం షేర్ హోల్డర్స్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యారని నిర్మల సీతారామన్ చెప్పారు.
అయితే మిగిలిన షేర్ హోల్డర్స్ ని ఇది ఎఫెక్ట్ చేయలేదని వారి యొక్క కాంట్రిబ్యూషన్ రూపాయలు 2.5 లక్షల కంటే తక్కువ అని ఆమె చెప్పారు. అలానే సీతారామన్ బిల్లు గురించి చర్చిస్తూ ఆదాయపు పన్ను చట్టం లో మార్పు అవసరమని వ్యాపారం చేయడం సులభం కోసం దీన్ని తీసుకురావాలని అన్నారు.
ఈ బిల్లు ద్వారా కస్టమ్స్ వ్యవస్థకు సవరణలు ప్రవేశపెడుతున్నారు. అయితే పన్ను చట్టాలను పాటించడం కంపెనీలకు కష్టమైందని మార్పు వైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అభివృద్ధి ప్రక్రియ భవిష్యత్తులో కొనసాగుతుందని చెప్పారు. అలానే ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ పై జీఎస్టి ఇంక్లూషన్ గురించి కూడా చర్చిస్తుంది అని అన్నారు. తదుపరి మీటింగ్ లో జీఎస్టీ కౌన్సిల్ తో పాటు వీటిపై చర్చ సాగుతుందని చెప్పారు.