వచ్చే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.బంగాళాఖాతంలో అధిక పీడనం కారణంగా ఎండలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సాధారణం కంటే, రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఉత్తరాది నుంచి తేమ గాలులు వీస్తున్నాయని, ఇదే సమయంలో బంగాళాఖాతం నుంచి వస్తున్న పొడి గాలులతో అధిక పీడనం ఏర్పడే అవకాశం ఉందని దీంతో ఎండలు పెరుగుతాయని అధికారులు పేర్కొన్నారు.
అలాగే రాయలసీమలో తేలికపాటి జల్లులు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. నెలాఖరులోగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, ఎండ వేడిమి నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. ఒకపక్క ఇలా ఉంటే తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఉత్తర తెలంగాణకు వర్ష సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని అంటున్నారు.