తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వాడీ వేడిగా సాగుతున్నాయి. అక్కడ ముక్కోణపు పోటీ ఉంటుందని అనుకుంటే నాలుగు వైపులా బలమైన అభ్యర్దులు దిగడంతో ప్రచారం తారా స్థాయికి చేరింది. ఏమి చేసి అయినా అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తున్న పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు అలిమి గాని వాగ్ధానాలు కూడా చేస్తున్నారు.
అలాగే తాజాగా తమిళనాడు ఎన్నికల్లో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి సంచలన హామీలు ఇచ్చారు. దక్షిణ మదురై నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగిన శరవణన్ ఈ హామీలు గుప్పించారు. నియోజకవర్గ ప్రజలని చంద్రమండలం మీదకు తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. ఇళ్ళలో ఆడవాళ్ళ పనికి సాయంగా ఇంటింటికీ రోబో పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. ఇక ప్రధాన పార్టీల వాళ్ళు కూడా ఏమీ తక్కువ తినలేదు. సంచలన హామీలు గుప్పించి చర్చనీయాంశంగా మారారు.