ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసీ ప్రవేశపెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. మద్యం పాలసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుని పెట్టుకుంది. త్వరలోనే మద్యం ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే మద్యం ధరలు తగ్గిస్తారా అనే దానిపై మాత్రం స్పష్టత లేకపోయినా బీర్లు ధరల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.
వచ్చేది వేసవి కాలం కావడంతో ముఖ్యమంత్రి జగన్ ధరలను తగ్గించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. బీర్ల విక్రయం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు ఉండవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే మద్యం విషయంలో కూడా ప్రజలు కాస్త వెనకడుగు వేయవచ్చు అనే అభిప్రాయం ఉంది.
తెలంగాణలో మద్యంపై ఆదాయం పెరుగుతుంది. ఇక రాష్ట్రంలో బీరు ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశాలు ఉండవచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులతో కూడా జగన్ మాట్లాడుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో పాత బ్రాండ్ లు తీసుకువచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.