పక్షులకి, జంతువులకి ఆహారం ఇస్తే ఈ సమస్యలు తొలగిపోతాయి…!

-

సాధారణంగా చాలా మంది పండితులు చెప్తూ ఉంటారు గోవులను పెంచాలని, చేపల్ని పెంచాలని… ఇలా ఒక్కో దాని వల్ల ఒక లాభం ఉంటుంది. అలానే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పక్షులకి ఆహారం వేయడం వల్ల మంచి కలుగుతుందని అంటున్నారు. వాటికి దానం చేయడం వల్ల శాంతి కలుగుతుంది. అలానే విశ్వమంతా కూడా శాంతిగా ఉంటుంది.

ఇది ఇలా ఉంటే పక్షులకి, జంతువులకి ఆహారం వేశారంటే ఒక్కొక్క గ్రహం వల్ల ఒక్కో ఫలితం కనబడుతుంది. అయితే మనకి ఏ దానం చేయడం వల్ల ఏ ఫలితం కనబడుతుంది అనేది చూద్దాం..!

జంతువులకి ఆహారం ఇవ్వడం వల్ల శుక్రుడు నుంచి మనకి విముక్తి కలుగుతుంది.

కోళ్లకు బిస్కెట్లు, బ్రెడ్ లేదా దాన్యం వేయడం వల్ల జీవితం లో వచ్చే కష్టాలు నుంచి స్వేచ్ఛ కలుగుతుంది.

అదే ఒకవేళ మీకు రాహు, కేతు దోషం ఉంటే జంతువులకు ఆహారం పెట్టడం మంచిదని పండితులు చెబుతున్నారు.

ఒకవేళ రవి వల్ల మీకు ఏమైనా బాధ ఉంటే మీరు గోధుమలను ఆహారం కింద వేయండి.

మానసికంగా మీరు ఇబ్బందులు పడుతూ శాంతి కలగాలి అంటే బియ్యాన్ని వేయండి.

బుధుడు నుంచి బాధ తొలగాలంటే పెసరపప్పు వేయండి.

అలానే ధాన్యం వేయడం వల్ల బృహస్పతి వల్ల బాధ మీకు తొలగుతుంది.

కాకులకి, కుక్కలకి ఆహారం ఇవ్వడం వల్ల రాహు, కేతు నుంచి మీకు బాధ తొలగుతుంది.

అలానే పంచదార సిరప్, పిండితో చేసిన లడ్డూ జంతువులకు, పక్షులకు ఆహారంగా వేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు శాంతి కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news