ఫ్రాన్స్ విద్యా శాఖ నిర్వహించిన సర్వేలో ఫ్రాన్స్ లో 96 శాతం పాఠశాలల్లో కండోమ్ వెండింగ్ యంత్రాలు ఉన్నాయని తేలింది. ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో ఈ కండోమ్ వెండింగ్ యంత్రాలను ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. మరీ ముఖ్యంగా, ఈ పాఠశాలలకు స్థానిక ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. 1992 లో, పాఠశాలల్లో కండోమ్ వెండింగ్ యంత్రాలను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఎయిడ్స్ రోగులు అధికంగా ఉన్నందున ఈ ఏర్పాట్లు అమలు చేశారు. అంటే మొదటి కండోమ్ వెండింగ్ మెషీన్‌ను 30 సంవత్సరాల క్రితమే పాఠశాలలో ఏర్పాటు చేశారు.
అంతకుముందు, పాఠశాలల్లో కండోమ్ యంత్రాలను ఏర్పాటు చేయడాన్ని ఫ్రాన్స్‌లోని ఫండమెంటలిస్టులతో సహా సామాన్య ప్రజలు వ్యతిరేకించారు. ఏదేమైనా ఈ నిరసన క్రమంగా తగ్గింది. అంతే కాక పాఠశాలల్లో కండోమ్ యంత్రాలను ప్రవేశపెట్టడానికి 83 శాతం మంది ప్రజలు మద్దతు ఇచ్చారు. అంటే ఒక రకంగా ఈ నిర్ణయాన్ని త్వరగానే ఈ కాథలిక్ దేశంలో చాలా మంది స్వాగతించారు. అయితే ఇలా యువతకు సురక్షితమైన లైంగిక అంశాల గురించి అవగాహన కల్పించిన ఏకైక దేశం ఫ్రాన్స్ మాత్రమే కాదు. యునైటెడ్ స్టేట్స్లో, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కండోమ్లు పంపిణీ చేయబడ్డాయి.