బ్రేకింగ్ : టీఆర్ఎస్ ఎంపీ ఇంట్లో సీబీఐ ట్రాప్.. ముగ్గురి అరెస్ట్

-

ఢిల్లీలో ఒక టీఆర్ఎస్ ఎంపీ ఇంట్లో సీబీఐ ట్రాప్ విధించడం ఆసక్తికరంగా మారింది. ఆ ఇంట్లో లంచం తీసుకుంటుండగా ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసింది. టీఆర్ఎస్ ఎంపీకి సహాయకులం అంటూ వాళ్ళు ముగ్గురూ డబ్బు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. రాజీవ్ భట్టాచార్య, శుభాంగి గుప్తా, దుర్గేష్ కుమార్ లు అని గుర్తించారు. అయితే సీబీఐ ఈ ట్రాప్ వేసిన సమయంలో ఎంపీ ఇంట్లో లేరని అంటున్నారు. ఆ టీఆర్ఎస్ ఎంపీ మరెవరో కాదు మాలోత్ కవితా. ఎంపీ కవిత యొక్క అధికారిక నివాసంలో లంచం తీసుకుంటుండగా ఈ ముగ్గురు వ్యక్తులను పట్టుకుంది.

అరెస్టయిన ముగ్గురిలో ఒకరు కవిత డ్రైవర్ అని తెలుస్తోంది. దుర్గేష్  కుమార్ తన డ్రైవర్ అని ఎంఎస్ మాలోత్ కవిత మీడియాకు ధృవీకరించగా, మిగతా ఇద్దరు తనకు తెలియదని ఆమె అన్నారు. ఈ విషయం పై ఇంకా మాట్లాడడానికి ఆమె నిరాకరించింది.  ఢిల్లీలోని న్యూ గుప్తా కాలనీలో నివసిస్తున్న మిస్టర్ లాంబా నుంచి ఫిర్యాదు అందుకున్న తరువాత ఈ ఇంటి మీద సీబీఐ ట్రాప్ వేసింది. తనను తాను మాలోత్ కవుత్గా పిఎగా పరిచయం చేసుకుంటున్న భట్టాచార్య తన ఇంటిని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కూల్చివేయకుండా కాపాడటానికి డబ్బు కోరినట్లు ఆయన ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news