వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ఏంటి అనేది దానిపై స్పష్టత రావడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్ర నేతలు అందరూ కూడా కొంతమంది విషయంలో చాలా సానుకూలంగా ఉన్నట్టు గా ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతోంది. కొంతమంది నేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
అంతేకాకుండా యూపీఏ లోకి కొంతమందిని తీసుకువచ్చే విధంగా సోనియాగాంధీ కష్ట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి త్వరలో సోనియాగాంధీతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే దక్షిణాదికి చెందిన ఒక కీలక నేతలతో సమావేశమై ఆయనను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి.
అలాగే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో సమావేశమైన తర్వాత ప్రధాన మంత్రి అభ్యర్ధి విషయంలో ఒక కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు అని సమాచారం. అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీ తో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆయనను కూడా దగ్గర చేసుకోవడానికి సోనియాగాంధీ తీవ్రంగా కష్టపడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. మరి ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో ఎవరిని ప్రకటిస్తారో చూడాలి. దీనిపై రెండు మూడు నెలల్లోనే కాంగ్రెస్ అధిష్టానం స్పష్టత ఇవ్వనుంది.