బాహుబలి రైటర్.. ఇండియన్ టాప్ డైరక్టర్స్ లో ఒకరైన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు కరోనా సోకినట్టు తెలుస్తుంది. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. సీనియర్ సిటిజెన్స్ కు కరోనా అనగానే కొద్దిగా ఆందోళన ఉంటుంది. అయితే వైద్యుల పర్యవేక్షణలో తన ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని అంటున్నారు విజయేంద్ర ప్రసాద్. అయితే రాజమౌళి తండ్రికి కరోనా అని తెలియగానే అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.
రాజమౌళి సినిమాలకు కథ అందించేది విజయేంద్ర ప్రసాదే. తండ్రి రాసిన కథ, కథనానికి రాజమౌళి మేకింగ్ ఉంటుంది. స్టూడెంట్ నెంబర్ 1 నుండి రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ వరకు విజయేంద్ర ప్రసాద్ పెన్ను ప్రభాగం రాజమౌళి సినిమాల మీద బాగా ఉంటుంది. అంతేకాదు సినిమా అవుట్ పుట్ విషయంలో కూడా జక్కన్నకు అన్ని విధాలుగా విజయేంద్ర ప్రసాద్ అండగా ఉంటారు. విజయేంద్ర ప్రసాద్ కు కరోనా అన్న విషయం తెలియగానే ఇండస్ట్రీలో కూడా అందరు షాక్ అవుతున్నారు. విజయేంద్ర ప్రసాద్ ఆరోగ్య విషయంపై త్వరలో మరిన్ని అప్డేట్స్ తెలుస్తాయి.