ప్యూమిక్ స్టోన్ తో ఎన్ని ఉపయోగాలో…!

-

ప్యూమిక్ స్టోన్ అనేది ఒక రకమైన వాల్కానిక్ రాయి. ఇది చల్లబడిన లావా మరియు మాగ్మా నుంచి వస్తుంది. ఇది ఎక్కువగా ఇటలీలో ఉంటాయి. అలాగే ఇటలీ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో కూడా ఎక్కువగా దొరుకుతాయి. మార్కెట్లో ఇది ఎక్కువగా దొరుకుతుంది. ఉంటాయి. దీనిని శరీరాన్ని శుభ్రం చేసుకోడానికి కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ప్యూమిక్ స్టోన్ ని ఎలా ఉపయోగించాలి..?, దీని వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి అనేది చూద్దాం..!

 

ప్యూమిక్ స్టోన్ ని ఎలా ఉపయోగించాలి..?

ముందు దానిని వేడి నీళ్లలో కొద్దిసేపు నానబెట్టాలి.
మీ ఒంటి మీద నీళ్లు పోసుకుని తర్వాత ప్యూమిక్ స్టోన్ తో గుండ్రంగా మీ శరీరం మీద రుద్దుతూ ఉండండి.
ఆ తర్వాత కొద్దిగా ఒత్తిడి పెట్టి మళ్ళీ గుండ్రంగా దానితో రబ్ చేస్తూ ఉండండి.
గట్టిగా ప్రెజర్ పెట్టడం కానీ వేగంగా చేయడం గాని చేయకండి. అలా చేయడం వల్ల చర్మం తొక్క ఊడిపోతుంది.
నెమ్మదిగా మీ ఒంటి మీద రుద్దిన తర్వాత మీ కాళ్లు చేతులు కూడా రుద్దుకొని ఆ తర్వాత మళ్ళీ కాసేపు నీళ్లల్లో దానిని ఉంచి మళ్లీ వాడండి.
ఆ తర్వాత మీరు సబ్బుని ఉపయోగించి రుద్దుకుని నీళ్లు పోసుకుని కావాలంటే మరోసారి మీరు ఆ రాయి తో రుద్దుకోవచ్చు.

మొత్తం అయిపోయిన తర్వాత నీళ్ళు పోసుకుని మీ చర్మాన్ని తుడుచుకోండి. ఆ తర్వాత మీ ఒంటికి మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి.

దీనిని ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే..?

మీరు మీ కాళ్ళు మరియు చర్మం పై కూడా మార్పు చూస్తారు. అలానే మీ చర్మం సాఫ్ట్ గా స్మూత్ గా అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news