మరోసారి వార్తల్లోకి ఎస్వీబీసీ.. వారి మీద దాడి చేస్తామంటూ ?

Join Our Community
follow manalokam on social media

తిరుపతి ఎస్వీబీసీ చానల్ వివాదం మరింత ముదిరింది. చానల్ ఎండీ ధర్మారెడ్డి, సీఈఓ నగేష్ మీద దాడి చేస్తామని బెదిరించినట్టు చెబుతున్నారు. ఇటీవల పోర్న్ వీడియోల వ్యవహారంలో తొలగించబడిన ఉద్యోగులే లేఖ పంపారని అలిపిరి పీఎస్ లో ధర్మారెడ్డి కంప్లైంట్ చేశారు. ఈ పోర్న్ వీడియోల వ్యవహారంలో ఇప్పటిదాకా పది మంది ఉద్యోగులను తొలగించారు. గతంలో ఏడుగురిని సస్పెండ్ చేయగా తాజాగా మరో ముగ్గురిపై వేటు పడింది.

ఎస్వీబీసీ ఎడిటర్ కృష్ణారావు, ఛానల్ మేనేజర్లు మురళీకృష్ణ, సోమశేఖర్ లను సస్పెండ్ చేశారు. ఉద్యోగాల నుంచి తొలగించిన ఉద్యోగుల కంప్యూటర్లలో అశ్లీల దృశ్యాలతో కూడిన వీడియోలు ఉన్నట్టు సైబర్ సెక్యూరిటీ విజిలెన్స్ విభాగం గుర్తించింది. గతంలో ఓ భక్తుడు ఎస్వీబీసీ ఛానల్ లో ప్రసారమయ్యే ‘శతమానం భవతి’ కార్యక్రమానికి ఈమెయిల్ పంపాడు. అయితే ఆ భక్తుడికి కార్యక్రమానికి సంబంధించిన సమాచారం అందించాల్సిన ఎస్వీబీసీ ఉద్యోగుల ఎంతో నిర్లక్ష్యం పూరితంగా ఓ అశ్లీల వీడియో లింక్ పంపాడు. దాంతో ఆ భక్తుడు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...