వృద్ధుడిలా కనిపించే బిడ్డను జన్మనిచ్చిన మేక..!

-

అప్పుడప్పుడు మనం కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను సామాజిక మాధ్యమాల్లో చూస్తుంటాం. నాలుగు చేతుల పిల్లాడు పుట్టాడని, ఒకే తలతో ఇద్దరు పిల్లలు పుట్టారని, లేదా ఆవు బిడ్డను జన్మనిచ్చిందని, ఇలా చాలా రకాల వార్తలు తరచూ కనిపిస్తూ ఉంటాయి. అయితే అలాంటి కోవకు చెందిన వార్తే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఓ మేక అచ్చం మనిషి పోలికలతో ఉన్న ఓ వృద్ధుడిని జన్మనిచ్చింది. అయితే ఈ పిల్లాడి గడ్డం చూసి మాత్రం అందరూ షాక్‌కి గురయ్యారు. పూర్వీకులకు గడ్డం ఎలా ఉంటుందో అలానే మేకకు పుట్టిన పిల్లాడికి అలా ఉందని ఆ గ్రామస్థులు చెబుతున్నారు.

మేక- బిడ్డ
మేక- బిడ్డ

ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సోన్‌గర్ జిల్లాలో చోటు చేసుకుంది. సోన్‌గర్ జిల్లా తాపి నది ఒడ్డున ఉన్న సెల్టిపాడ్ గ్రామానికి చెందిన అజయ్‌భాయ్ వాసవ్ వృత్తిపరంగా రైతు. ఇతడికి మేకలు కూడా ఉన్నాయి. గర్భంతో ఉన్న ఓ మేక ఇటీవల జన్మనిచ్చింది. అయితే ఈ మేకకు జన్మించిన మేకపిల్లను చూసి గ్రామస్థులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. మనిషిని పోలిన బిడ్డను మేక జన్మనివ్వడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

ఈ మేకపిల్లకు నుదురు, కళ్లు, నోరు, గడ్డం.. అచ్చం మనిషిలా కనిపించేలా మేక ఈ పిల్లాడిని జన్మనిచ్చింది. కొన్ని భాగాలు మనిషి పోలికలు, మరికొన్ని భాగాలు మేక పోలికలను కలిగి ఉన్నాడు. ఇలా పుట్టిన పిల్లాడికి తోక లేకపోగా.. ముఖంపై గడ్డం ఉంది. పూర్వం వృద్ధులు ఎలా ఉంటారో అలాంటి పోలికలతో ఈ పిల్లాడు పుట్టాడు. అయితే ఈ పిల్లాడు పుట్టిన 10 నిమిషాలకే చనిపోయాడు. దీంతో గ్రామస్థులంతా పూజలు నిర్వహించి.. చివరకు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఇలాంటి వింత ఘటనను చోటు చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మేకకు పిల్లాడు పుట్టాడని తెలిసి చాలా మంది చూడటానికి తరలివచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news