ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు.. వీటి ధర ఎంతో తెలుసా..?

-

మనం మార్కెట్‌కి వెళ్ళినప్పుడు కొన్ని సార్లు వింత ఆకారంలో ఉన్న పండ్లు, కూరగాయలను చూస్తుంటాము. కొన్ని పొడవుగా కనిపిస్తే.. మరికొన్ని చిన్న చిన్న కనిపిస్తూ ఉంటాయి. అయితే సాధారణంగా మనం మార్కెట్‌లో పండ్లు, కూరగాయలను కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బేరమాడుతాం. ఏదో ఒక రేటు దగ్గర అమ్మకందారుడితో పండ్లను కొనుగోలు చేసేసుకుంటాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పండ్లను ముట్టుకోవడటం కాదు కదా.. వాటిని బేరం కూడా ఆడలేము. ఆ ఫ్రూట్స్ ధర తెలిస్తే వాటి దరిదాపుల్లో కూడా వెళ్లము. ఒక్కో పండు రూ.లక్షల్లో ధర పలుకుతుంది. ఇవి ప్రపంచంలోనే ఖరీదైన పండ్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. అయితే ఆ పండ్లు ఏంటో ఒక్కసారి చూద్దామా.

fruit
fruit

సాధారణంగా మామిడి పండ్ల ధర మన దేశంలో చాల తక్కువగా ఉంటుంది. కానీ, కొన్ని దేశాల్లో పండించే మామిడి పండ్లకు ధర ఎక్కువగానే పలుకుతుంది. మామిడి ధర రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. ఆస్ట్రేలియాకు చెందిన టాప్ ఎండ్ రకం 12 మామిడి పండ్ల ట్రే 50,000 డాలర్లు పలికింది. అంటే ఇండియన్ కరెన్సీలో చూస్తే రూ.37,23,127 వరకు ఈ పండ్ల ధర ఉంటుంది. ఏటా అక్కడ నిర్వహించే మామాడి పండ్ల వేలంలో ఈ రికార్డు ధర నమోదు అయింది.

పుచ్చకాయలో కూడా అనేక రకాలు ఉన్నాయి. ఇందులో ‘డెన్సుకే’ రకం అనేది చాలా అరుదైన పండు. దీనిని జపాన్‌లోని హక్కైడోలో పండిస్తారు. డెన్సుకే పుచ్చకాయ ఒకటి ఆరువేల డాలర్లకు అమ్ముడైంది. అంటే ఇండియన్ కరెన్సీలో దీని ధర రూ.3,27,262 ఉంటుంది. యుబారి కింగ్ మెలోన్స్ అనే పండు ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటి. పసుపు పచ్చ రంగులో గుజ్జు, పండుపైన గుమ్మడి కాయ రంగులో ఉంటుంది. యుబారి పుచ్చకాయలు 29,300 డాలర్లకు వేలం జరిగింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.21,81,752.

అలాగే యూకేలోని గిగాంటెల్లా మాగ్జిమ్ అనే స్ట్రాబెర్రీస్‌.. సాధారణ స్ట్రాబెర్రీల కంటే కాస్త భిన్నంగా ఉంటాయి. ఒక వేలంలో గిగాంటెల్లా మాగ్జిమ్ రకం స్ట్రాబెర్రీ ఒకటి 4,395 డాలర్లు పలికింది. అంటే సుమారు మన భారత కరెన్సీలో రూ.2,39,719 ఉంటుంది. రూబీ రోమన్ ద్రాక్ష అనే పండ్లు జపాన్‌లో కనిపిస్తాయి. రూబీ రోమన్ ద్రాక్ష ఒక్క గుత్తి 14,600 డాలర్లకు అమ్ముడై రికార్డు నమోదు చేసింది. దీని ధర ఇండియన్ కరెన్సీలో రూ.10,87,153 ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news