కేసీఆర్ సభ వద్దు అంటూ.. వరుస పిటిషన్లు, ఫిర్యాదులు !

-

ముఖ్యమంత్రి హాలియా సభ రద్దు చేయాలని వరుసగా పిటిషన్ లు, ఫిర్యాదులు దాఖలు అవుతున్నాయి.  ముఖ్యమంత్రి హాలియా సభ రద్దు చేయాలని యుగతులసి ఫౌండేషన్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం కరోనా సందర్భంగా ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించొద్దని ప్రభుత్వం జీవో నెంబర్ 69 విడుదల చేసింది అని పిటిషనర్ పేర్కొన్నారు.

అలాంటి జీవో విడుదల చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎలా సభకు అనుమతి ఇస్తారు అని పిటిషనర్ ప్రశ్నిస్తారు. హాలియా బహిరంగ సభను రద్దు చేయాలని హెచ్చార్సీలో రాచాల యుగంధర్ గౌడ్  పిటిషన్ దాఖలు చేశారు.  కోవిడ్ దృష్ట్యా సభలు నిర్వహించొద్దు అని రాష్ట్ర ప్రభుత్వం 69 జీవోను జారీ చేసిందని, స్వయంగా ముఖ్యమంత్రే ప్రభుత్వ జీవోను ఉల్లంఘిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  హాలియా సభ రద్దుకై ఎన్నికల కమిషన్ మరియు డిజిపికి ఆదేశాలివ్వండని అయన కోరారు.  

Read more RELATED
Recommended to you

Latest news