ఉగాది పర్వదినం..ప్లవనామ సంవత్సరం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు

-

తెలుగు వారి పండగ ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టే ఈ పర్వదినాన్ని ఉగాదిగా జరుపుకుంటారు. యుగానికి ఆరంభం కాబట్టి యుగాది అన్న పేరుతో పిలుస్తూ ఉగాదిగా మారింది. ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 13వ తేదీన జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటకలోనూ ఉగాదిని ఆనందోత్సహాలతో జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఈ రోజుని గుడిపడ్వా అని పిలుస్తారు. తెలుగు లోగిళ్ళలో ఈ రోజున గుమ్మాలను మామిడి ఆకులతో అలంకరించి ఇంటి ముందు కళ్ళాపి జల్లి కొత్త కళని తీసుకువస్తారు.

ఇక ఉగాది రోజున ప్రత్యేకమైనది ఏదైనా ఉందంటే అది పచ్చడే. ఉగాది పచ్చడికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆరు రుచుల సమ్మేళనంతో చేసే పచ్చడి, చాలా ఆరోగ్యకరమైనది. తీపి, పులుపు, చేదు, కారం, వగరు, కటువు మొదలైన రకాలతో చేసి పచ్చడి చేసుకుని ఆరగిస్తారు. ఈ ఆరు రకాల రుచులకు గాను మామిడి, వేప, బెల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు వాడతారు. ఐతే పచ్చడిని ఒక్కోదగ్గర ఒక్కో రకంగా తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో తినేలా చేస్తే, కొన్ని ప్రాంతాలు తాగేలా చేస్తారు.

ఈ రోజు చేసే మరో ముఖ్యమైన పని, పంచాంగ శ్రవణం. కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి, ఆ సంవత్సరం మనకి ఎలా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయనే విషయాలు పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటారు. ఈ ఉగాది సందర్భంగా మీ స్నేహితులతో పంచుకోవడానికి కావాల్సిన కొటేషన్లు..

ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలోకి కొత్త ఆశలని, కొత్త ఆశయాలని తీసుకువచ్చి మిమ్మల్ని మీకు కొత్తగా చూపిస్తుందని ఆశిస్తూ, ఉగాది శుభాకాంక్షలు.

అందమైన జ్ఞాపకాలని మీ కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి ఈ ఉగాది పర్వదినం ఒక శుభారంభం ఇస్తుందని కోరుకుంటూ.. ఉగాది శుభాకాంక్షలు.

పచ్చడిలోని ఆరు రుచులు మీ జీవితంలో ఒక భాగంలా ఉంటాయి. అవి ఉన్నప్పుడే మీ జీవితం అందంగా తయారవుతుందని తెలుసుకోండి.. ఉగాది శుభాకాంక్షలు.

 

Read more RELATED
Recommended to you

Latest news