రైతులకు గుడ్‌న్యూస్.. నేరుగా బ్యాంకు అకౌంట్‌లోకి డబ్బులు జమ..!

-

న్యూఢిల్లీ: రైతుల ఆందోళన మధ్య కేంద్ర ప్రభుత్వం వారి ప్రయోజనాలకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పంజాబ్‌ రైతులతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న రైతులు నేరుగా తమ బ్యాంకు ఖాతాలోనే ఉత్పత్తుల ధరలను పొందుతారని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఎంఎస్‌పీలో రైతులు తమ పంటను అమ్మిన తర్వాత వచ్చిన డబ్బును రైతులు ఖాతా జమ చేస్తామన్నారు. రైతుల ప్రయోజనం కోసం ప్రధాని నరేంద్రమోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఈ విధానాన్ని పంజాబ్‌లో ప్రవేశ పెట్టింది. పంజాబ్ రైతులు అమ్మిన తమ పంటకు మద్దతు ధరను బ్యాంకు ఖాతాలోనే జమ చేయడం జరుగుతుంది. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ విధానం అమలు చేయనున్నారు. దేశ రైతులు తమ పంటను ఎంఎస్‌పీలో అమ్మిన తర్వాత.. ఆ డబ్బులు వారి ఖాతాలో పొందుతారు. స్వాతంత్ర్యం వచ్చినా తర్వాత రైతుల్లో వచ్చిన పెద్ద మార్పు ఇదేనని, కౌలుదారులకు కూడా ఈ విధానం వర్తింపజేయడం జరుగుతుందని మంత్రి పియూష్ గోయల్ తెలిపారు.

రైతులు
రైతులు

ప్రభుత్వ సేకరణకను పారదర్శకం చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యక్ష బ్యాంకు ఖాతా చెల్లింపు (డీబీటీ) విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ విధానాన్ని పంజాబ్ రాష్ట్రంలో మినహా అన్ని రాష్ట్రాల్లో అమలు చేశారు. 2018-19 సంవత్సరంలో పంజాబ్ ప్రభుత్వం కేంద్రానికి చాలా సార్లు లేఖ రాశారు. అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో పంజాబ్ రైతులు ఆందోళనకు దిగారు. అయితే కమిషనర్లపై ఒత్తిడి, మార్కెట్ నిబంధనలు ప్రకారం అలా చేయడం సాధ్యం కాదన్నారు. దీంతో ప్రస్తుతం పంజాబ్‌లో కూడా రైతుల అకౌంట్‌లోకి డబ్బులు నేరుగా జమ అవుతాయి. ఫుడ్ మినిస్ట్రీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు పంజాబ్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు నిర్వహించారు. డబ్బు చెల్లింపు సమస్యను సులభతరం చేయడంతో.. నేరుగా బ్యాంకులోనే డబ్బులు జమ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news