నా పెళ్లి గురించి మీకెందుకు..!

-

కోలీవుడ్ స్టార్ తనయ వరలక్ష్మి శరత్ కుమార్ మీడియా మీద మండిపడుతుంది. కోలీవుడ్ స్టార్ శరత్ కుమార్, రాధికల గారాల పట్టి అయిన వరలక్ష్మి శరత్ కుమార్ హీరో విశాల్ తో ప్రేమాయణం అందరికి తెలిసిందే. విశాల్, వరలక్ష్మి డైరెక్ట్ గా ఓపెన్ కాకున్నా ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టమని తెలిసిందే. ఆమెతో పెళ్లికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు విశాల్. అయితే వరలక్ష్మి మాత్రం పెళ్లి మీద ఆసక్తి లేదని చెప్పుకొస్తుంది.

ఇక రీసెంట్ గా ఓ ప్రముఖ తమిళ దిన పత్రిక విశాల్, వరలక్ష్మి ప్రేమ మీద ఓ కథనం రాసింది. అది తెలిసిన వరలక్ష్మి అగ్గి మీద గుగ్గీలవుతుంది. అసలు నా పెళ్లి గురించి మీకెందుకు.. ఇలాంటి కథనాలు రాసిన వారు లూజర్స్ అని అన్నది వరలక్ష్మి. మీడియా ఇలాంటి చెత్త వార్తలని రాయడం ఆపేయాలని ఫైర్ అవుతుంది. రీసెంట్ గా విజయ్ సర్కార్, విశాల్ పందెం కోడి-2 సినిమాలలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ ఆ సినిమాల్లో నెగటివ్ రోల్స్ తో ఆకట్టుకుంది.

జయలలిత స్పూర్తితో రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ చూస్తుంటే జయలలితలానే పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలని చూస్తుందని అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news