దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఏ రూపంలోనైనా కరోనా వ్యాప్తి జరిగే ప్రమాదముందని, ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగింది. బయటికి వెళ్లినప్పుడు మన చేతులు ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మన ఫోన్లకు చేయి తాకడం జరుగుతుంది. దీంతో చేతుల ద్వారా ఫోన్లకు వైరస్ అంటే ప్రమాదముంది. ఫోన్‌పై ఉన్న వైరస్‌ను తొలగించేందుకు అప్పుడప్పుడు ఫోన్‌ను శుభ్రంగా క్లిన్ చేసుకోవాలి.
ఇలాంటి పరిస్థితిలో మీ ఫోన్లను శుభ్రపరుచుకోవడానికి 3 ఉత్తమ మార్గాలను తెలుసుకుందాం. అయితే సాధారణంగా చాలా మంది ఓ తప్పు చేస్తారు. చేతులను శుభ్రం చేసుకునే శానిటైజర్‌తో మొబైల్స్‌ను శుభ్రం చేసుకోవచ్చని అనుకోవచ్చు. కానీ దీనివల్ల మీ మొబైల్ దెబ్బతినే అవకాశాలు ఉంది. మీ ఫోన్ స్క్రీన్‌పై మచ్చలు ఏర్పడటం, షార్ట్ సర్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే కొన్ని చిట్కాలను పాటించి మీ మొబైల్ ఫోన్‌ను శుభ్రం చేసుకోండి.
స్మూత్‌గా ఉండే బట్టతో..
ఇంటి నుంచి బయటకు వెళ్లి.. తిరిగి ఇంటికి చేరుకున్నప్పుడు శరీరం, మొబైల్‌పై వైరస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మొబైల్స్‌ను శుభ్రం చేసుకోవడానికి మార్కెట్‌లో దొరికే 70 శాతం ఆల్కహాల్ ఉండే శానిటైజర్‌ను తీసుకోవాలి. స్మూత్‌గా ఉంటే చిన్న తెల్లటి గుడ్డపై ఒక్క డ్రాప్ ఆల్కహాల్ శానిటైజర్ పోసి ఫోన్ కిందా, పైనా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దీంతో ఫోన్‌పై ఉండే అన్ని క్రిములు శుభ్రం అవుతాయి.
కాటన్‌తో శుభ్రం చేయండి..
మొబైల్ ఫోన్‌ను శుభ్రం చేయాలనుకుంటే.. ముందుగా మొబైల్ ఫోన్‌ను స్విచ్‌ఆఫ్ చేసుకోవాలి. ఒక కాటన్ ముక్కను తీసుకోవాలి. మొబైల్‌పై కొంచెం శానిటైజర్ వేసుకుని కాటన్‌తో శుభ్రం చేసుకోవాలి. ఒక వేళ మీరు మీ ఫోన్‌ను శుభ్రం చేయాలని అనుకుంటే.. ఆయా బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్ల కస్టమర్ కేర్‌కు కాల్ చేసి వివిధ మార్గాలను కనుక్కోవచ్చు. ఎందుకంటే.. వివిధ కంపెనీలు ఫోన్ మెటీరియల్స్, డిస్‌ప్లేలు చాలా భిన్నంగా ఉంటాయి.
యాంటీ బాక్టీరియల్ పేపర్‌లో..
మొబైల్‌లను శుభ్రం చేయడానికి యాంటీ బాక్టీరియల్ టిష్యూలను వాడాలి. ఇవి చాలా సురక్షితమైనవి. ఏదైనా మెడికల్ స్టోర్‌కు వెళ్లి ఈ టిష్యూ పేపర్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ పేపర్లు చాలా పొడిగా ఉంటాయి. వీటి వల్ల మొబైల్ డిస్‌ప్లేపై ఎలాంటి గీతలు పడవు.