ఈ నెల 21 నుంచి పోస్టాఫీసుల్లో పేమెంట్స్ బ్యాంక్ సేవలు..!

-

దేశంలో ఉన్న దాదాపు అన్ని పోస్టాఫీసుల్లోనూ త్వరలో పేమెంట్స్ బ్యాంక్ సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రధాని మోడీ ఈ నెల 21వ తేదీన ఈ సేవలను ప్రారంభిస్తారు. ఈ సేవలను ఇప్పటికే ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతి కారణంగా తేదీలను మార్చారు. దీంతో ఈ నెల 21వ తేదీ నుంచి పోస్టాఫీసుల్లో పేమెంట్స్ బ్యాంక్ సేవలు ప్రారంభం అవుతాయి.

పోస్టాఫీసుల్లో ప్రారంభం కానున్న పేమెంట్స్ బ్యాంక్ సేవల ద్వారా కస్టమర్లు మూడు రకాల సేవింగ్స్ అకౌంట్లను తెరవవచ్చు. అవి రెగ్యులర్, బేసిక్, డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లు. రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ ద్వారా కస్టమర్లు తన సొమ్మును అకౌంట్‌లో డిపాజిట్ చేయవచ్చు, క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. క్యాష్ విత్‌డ్రాయల్స్‌కు పరిమితి ఏమీ ఉండదు. అలాగే ఈ ఖాతాలపై 4 శాతం వడ్డీని ఇస్తారు.

పోస్టాఫీస్ బేసిక్ సేవింగ్స్ అకౌంట్‌లో నెలకు కేవలం 4 క్యాష్ విత్‌డ్రాయల్స్‌ను మాత్రమే అనుమతిస్తారు. అలాగే ప్రాథమిక బ్యాంకింగ్ సేవలకు స్వల్ప మొత్తంలో ఫీజు వసూలు చేస్తారు. ఈ సేవింగ్స్ అకౌంట్‌లపై కూడా 4 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఇక డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లలో పోస్టాఫీస్ పేమెంట్స్ బ్యాంక్ మొబైల్ యాప్‌లో కస్టమర్లు బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. అందుకు గాను కస్టమర్లకు 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. ఆధార్, పాన్ కార్డుల సహాయంతో అకౌంట్ తెరవవచ్చు. ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో ఈ అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్లపై కూడా 4 శాతం వడ్డీ చెల్లిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news