పేపర్ బోయ్ ట్రైలర్.. ఫీల్ గుడ్ మూవీ

-

దర్శకుడిగా సంపత్ నంది తన పంథాలో తను సినిమాలు చేస్తూనే నిర్మాతగా మరికొంతమందికి అవకాశం ఇస్తున్నాడు. ఇంతకుముందు గాలిపటం నిర్మించిన సంపత్ నంది రెండో ప్రయత్నంగా పేపర్ బోయ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కథ, కథనాలు ఫీల్ గుడ్ మూవీతో వస్తున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.

సంతోష్ శోభన్, రియా సుమన్ లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమాకు కథ సంపత్ నంది అందించడం విశేషం. నూతన దర్శకుడు జయశంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ట్రైలర్ అయితే ఇంప్రెస్ చేసింది. షార్ట్ ఫిలిమ్స్ తో సత్తా చాటిన జయశంకర్ మొదటిసారి ఫీచర్ ఫిల్మ్ గా చేస్తున్న ఈ పేపర్ బోయ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news