గ్యాస్ సిలిండర్ ని ఏ ఏజెన్సీ నుంచైనా పొందొచ్చు…!

-

గ్యాస్ సిలెండర్ ని మీరు బుక్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా..? మీరు ఇండేన్ గ్యాస్ కస్టమరా? త్వరలోనే మీరు ఏ సిలిండర్ ని అయినా ఉపయోగించే అవకాశం వుంది. ఏ కంపెనీ సిలెండర్ అయినా సరే ఇక నుండి మరో కంపెనీ లో ఆర్డర్ చెయ్యచ్చు, డెలివరీ పొందొచ్చు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

మీరు కనుక ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పొందాలంటే నచ్చిన ఏజెన్సీకి వెళ్లి కనెక్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ కనుక సిలిండర్ అయిపోతే కొత్త ఎల్‌పీజీ సిలిండర్ బుక్ చేయడానికి ఏ ఏజన్సీ నుండి అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో కొత్త రూల్స్ అమలు లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా ఎల్‌పీజీ సిలిండర్ ఉపయోగించే వారు వారి ఏజెన్సీ నుంచి మాత్రమే కాకుండా ఇతర ఏజెన్సీల నుంచి కూడా సిలిండర్ పొందే వెసులుబాటు అందుబాటు లోకి రానుంది. ఇది కనుక అమలు లోకి వస్తే… హెచ్‌పీ, భారత్ గ్యాస్ సిలిండర్ పొందొచ్చు. అలాగే హెచ్‌పీ, భారత్ గ్యాస్ కస్టమర్లు ఇండేన్ గ్యాస్ సిలిండర్లు పొందే ఛాన్స్ వుంది. అయితే దీనికి గల కారణం ఏమిటంటే..?

కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫామ్ రూపకల్పనపై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో సర్వీసులు ఈజీ అవుతాయి మరియు స్పీడ్ అవుతాయి. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ కంపెనీలు త్వరలోనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news