నూతన ఏడాది తొలి రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల సందర్శనతో బిజీబిజీగా గడిపారు. ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించి మేడిగడ్డ పనులను ప్రారంభించారు. ఏరియల్ వ్యూ ద్వారా పనుల పురోగతిని పరిశీలించిన ఆయన మార్చి నెలాఖరు వరకు మేడిగడ్డ పనులు పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. ప్రాజెక్టు పనులు ఏయే దశల్లో ఉన్నాయి, ఎప్పటిలోగా పూర్తవుతాయనే వివరాలు తెలుసుకున్నసీఎం పనుల్లో వేగం పెరిగేందుకు సీఎం పలు సూచనలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించాలంటే మేడిగడ్డ పూర్తికావడం కీలకమన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై భారీ వ్యయం చేస్తున్నామని, తెలంగాణ సస్యశ్యామలం కావాలంటే కాళేశ్వరం కీలకమన్నారు. వీటితో పాటు పలు కార్యక్రమాల గురించి, ప్రాజెక్టు ఆధారిత ప్రాంతాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.