జగన్ పాదయాత్ర ఎప్పుడు ముగుస్తుందో తెలుసా?

-

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో కొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ విషయమై జనవరి 9న యాత్ర ఇచ్చాపురంలో ముగుస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆ రోజు నాటికి  ఇచ్చాపురం తో సహా కలసి 134 నియోజకవర్గాలలో 3,500 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేశారన్నారు. ఐదురోజులపాటు స్థానిక నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. ప్రభుత్వ వైఫల్యాలను, వైసీపీ పథకాలను‌ వివరిస్తారని తెలిపారు. ఇచ్చాపురం లో జరిగే ముగింపు సభకు అన్ని నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో  వస్తారన్నారు. చంద్రబాబు మోసాలకి చరమ గీతం పాడే సమయం దగ్గరకు వచ్చిందన్నారు.  

ఏపీ ప్రజలకు కొత్త ఆశాకిరణం వైఎస్‌ జగన్‌ , రాష్ట్ర విభజన తర్వాత తప్పిదాలు, అసమర్థతతో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందని.. 2019 ఎన్నికల్లో అవినీతి పరుల పాలనకు చరమగీతం పాడి ప్రజలు జగన్‌‌ను రాష్ట్రానికి సీఎంగా పట్టంకట్టబోతున్నారని ధీమాను వ్యక్తం చేశారు. ఈ యాత్ర ముగిసిన తర్వాత త్వరలోనో బస్సు యాత్రను చేపట్టనున్నట్లు చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆంధ్రాలో ప్రచారం చేస్తే ఓట్లు పడతాయని తాము అనుకోవడంలేదని.. ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు తెలపడం.. లేఖ రాస్తాననడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబు కుళ్లు, కుతంత్ర రాజకీయాన్ని ఏ పార్టీ నాయకులు ఎండగట్టిన స్వాగతిస్తామన్నారు. త్వరలోనే ఏపీకి మంచి రోజులు రాబోతున్నట్లు ఆయన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news