హన్సిక ఏంటీ అరాచకం

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న హాన్సిక మోత్వాని ప్రస్తుతం అక్కడ ఇక్కడ కెరియర్ అంత జోష్ ఫుల్ గా లేదని చెప్పాలి. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ అమ్మడు సినిమాల పరంగా చాలా వెనక్కి తగ్గింది. అందుకే లేటెస్ట్ గా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీతో వస్తుంది హాన్సిక.

మహా టైటిల్ తో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సినిమా చేస్తుంది హాన్సిక. జమీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పోస్టర్స్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. హాన్సిక ఈ సినిమాలో డిఫరెంట్ రోల్స్ తో కనిపిస్తుందట. మొన్నామధ్య కాషాయ దుస్తులు ధరించి దుమపానం చేస్తూ ప్రేక్షకులతో చీవాట్లు తిన్న హాన్సిక లేటెస్ట్ గా పూల్ మొత్తం రక్తంతో నిండి ఉన్న ఫోటోతో సర్ ప్రైజ్ చేసింది. చేతిలో గన్.. ముఖం మీద రక్తపు మరకలు హాన్సిక చేస్తున్న ఈ సాహసం మెచ్చుకోదగినదే. మరి ఈ సినిమా అయినా హాన్సికకు మునుపటి ఫాం వచ్చేలా చేస్తుందేమో చూడాలి.