కన్నతల్లి జీన్సే పిల్లలకు కూడా వర్తిస్తాయి. అయితే.. ఇన్ని రోజులు తల్లికి సంబంధించిన లక్షణాలు, గుణాలే పిల్లలకు వస్తాయేమో అని అనుకున్నాం. కానీ.. తల్లి దీర్ఘాయువు అయితే తన పిల్లలు కూడా దీర్ఘాయుష్కులు అవుతారట. ఇదేదో మేం చెబుతున్నది కాదు.. కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.
ఎటువంటి రోగాలు లేకుండా 90 ఏళ్లకు పైగా బతికిన మహిళలకు పుట్టిన ఆడపిల్లలు కూడా వాళ్లలాగనే ఎక్కువ కాలం జీవిస్తారట. తల్లే కాదు.. తండ్రి కూడా దీర్ఘాయువు అయితే.. వాళ్లకు పుట్టిన కూతుళ్లు దీర్ఘాయుష్కులు అవుతారట. మొత్తం 22 వేల మంది మహిళలపై పరిశోధకులు అధ్యయనం చేసి ఈ విషయాలను కనుగొన్నారు.