నీళ్లులేక పంట ఎండిపోయి.. రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామానికి చెందిన రైతు కొరుకోప్పుల సత్తయ్య (50) 19 గుంటల్లో వరి పంట వేయగా నీళ్లులేక పంట ఎండిపోయింది.
దానికితోడు పాపయ్యపల్లిలో మూడు ఎకరాల వ్యవసాయ భూమిని కౌలు తీసుకొని పత్తి వేయగా సరిపడా దిగుబడి రాలేదు. అప్పులు ఎక్కువ అవ్వడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక మనో వేదనకు గురైన సత్తయ్య వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి వెళ్లి సత్తయ్యను ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు.