అమెరికా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూశారు. ఆదివారం ఆయనకు రాత్రి గుండె నొప్పి వచ్చింది. దీంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితంలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రసాదరావు తుది శ్వాస విడిచారు.
ప్రసాదరావు ఏపీలోని విజయవాడలో జన్మించారు. 1979వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రసాదరావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్ ఎస్పీగా పని చేశారు. అనంతరం ఏసీబీ డీజీగా, విశాఖ ఎస్పీ, హైదరాబాద్ కమిషనర్‌గా, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగానూ పని చేశారు. ప్రసాదరావు సేవలకు రెండు పురస్కారాలు అందుకున్నారు. 1997లో భారత పోలీస్ పతకం, 2006లో రాష్ట్రపతి పోలీసు పతకాలను ఆయన అందుకున్నారు. డీజీపీ దినేశ్ రెడ్డి తర్వాత 30 సెప్టెంబరు 2013లో ఇన్‌చార్జ్ డీజీపీగా ప్రసాదరావు పని చేశారు.