కరోనా వాక్సిన్ కి సంబంధించి ఇప్పుడు కాస్త ఆసక్తికర చర్చలు ఉన్నాయి. వాక్సిన్ సమర్ధవంతంగా పని చేస్తుందా లేదా అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. వాక్సిన్ విషయంలో వేరియంట్ లు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మన ఇండియాలో ఉండే కొన్ని వేరియంట్ లు వాక్సిన్ కి సవాల్ చేస్తున్నాయి. ఇక ఇండియాలో వ్యాపిస్తున్న కొత్తరకం కరోనా వేరియంట్లపై సమర్ధంగా ఫైజర్, మోడెర్నా టీకాలు పని చేస్తున్నాయి.
అమెరికన్ సంస్థలు జరిపిన పరిశోధనలో ఈ విషయం బయటకు వచ్చింది. బి.1.617, బి.1.618 వేరియంట్లపై ఎన్‌వైయూ గ్రాస్‌మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, లాంగోన్ సెంటర్ సంయుక్త పరిశోధన చేసారు. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు ఇమ్యూనిటీ పెంపులో 4 రెట్లు ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ఫలితాలు వచ్చాయి.